telugu navyamedia
రాజకీయ సామాజిక

యూజర్‌ లకు  ట్విట్టర్‌ షాక్.. ఇక రోజుకు 400 మందిని మాత్రమే..!

Twitter latest guidelines per day 400 users
ప్రముఖ మైక్రో బ్లాగింగ్‌ సంస్థ ట్విట్టర్ తాజాగా కొత్త నిబంధనలను అందుబాటులోకి తెచ్చింది. ఇకపై ట్విట్టర్‌ లో ఏ యూజర్‌ అయినా సరే.. రోజుకు 400 మందిని మాత్రమే ఫాలో అయ్యేందుకు వీలుంటుంది. అంతకు మించితే ఎర్రర్‌ మెసేజ్‌ చూపిస్తుంది. అయితే ఇది కేవలం నాన్‌ వెరిఫైడ్‌ అకౌంట్లకు మాత్రమే వర్తిస్తుంది. వెరిఫైడ్‌ అకౌంట్లు ఉన్న ట్విట్టర్‌ యూజర్లు రోజుకు 1000 మందిని ఫాలో అవచ్చని తెలిపింది.  
అలాగే ఏ యూజర్‌ అయినా సరే గరిష్టంగా 5వేల మందిని మాత్రమే ఫాలో అవచ్చు. ఆ పరిమితి దాటితే యూజర్లు కొంత కాలం ఆగాల్సి ఉంటుంది. ఆ సమయంలో వారి ఫాలోవర్ల సంఖ్య పెరిగితే అందుకు అనుగుణంగా వారికి ఇతర అకౌంట్లను ఫాలో అయ్యేందుకు అవకాశం ఇస్తారు. కాగా ఈ కొత్త నిబంధనలు ఇప్పటికే అమలులోకి వచ్చాయని ట్విట్టర్‌ ఒక ట్వీట్‌లో వెల్లడించింది. 

Related posts