కేరళలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇప్పటివరకు 72 మంది చనిపోగా 58 మంది గల్లంతయ్యారు. ఈ నేపథ్యంలో ఆదివారం కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కేరళలోపర్యటించారు. ప్రస్తుతం కేరళలలో పరిస్ధితి దారుణంగా ఉందన్నారు. ప్రభుత్వం చేపడుతున్న సహాయక చర్యలు ఏమాత్రం సరిపోవని తెలిపారు. తక్షణం యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని ఆయన ప్రధాని మోడీని కోరారు.వరద ప్రభావిత రాష్ట్రాలకు సాయం విషయంలో కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి షేర్ గిల్ ఆరోపించారు.
మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రెండు లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. 1,318 సహాయక శిబిరాలను ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఎప్పటికప్పుడు పరిస్ధితిని సమీక్షిస్తున్నారు.సహాయక బృందాలు నిరంతరం పనిచేస్తున్నాయని ఆయన తెలిపారు. పెరియార్ డ్యామ్‌లో భారీగా వరద నీరు చేరడంతో కొచ్చి ఎయిర్‌పోర్ట్ శుక్రవారం నుంచి మూసివేశారు.