telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

తిరుమల : .. సూర్యప్రభ వాహనంపై .. శ్రీ మలయప్ప దర్శనం..

suryaprabhavahanam today in brahmostav

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. నేటి ఉదయం శ్రీనివాసుడు సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిస్తున్నాడు. సూర్యుడు తేజోనిధి. సకల రోగాల నివారకుడు. ప్రకృతికి చైతన్య ప్రదాత. వర్షాలు, వాటి వల్ల పెరిగే సస్యాలు, చంద్రుడు, పెరిగే ఓషధులు అన్నింటికీ మూలం సూర్యతేజం. అలాంటి సూర్యప్రభను అధిష్ఠించి వేంకటేశ్వరుడు తిరుమాడ వీధుల్లో విహరిస్తున్నాడు.

శ్రీమన్నారాయణుడు సూర్యమండల మధ్యవర్తి. అందుకే నిత్యం సూర్యోపాసన చేసే సంస్కృతి భారతీయ సనాతన ధర్మం. సూర్యుడు సప్త రశ్మి. సప్తాశ్వ రథారూఢుడై లోకానికి చైతన్యం కలిగిస్తూ శ్రీమన్నారాయణున్ని ముందుకు నడిపిస్తున్నాడు. సూర్యప్రభపై దేవదేవుడి దర్శనం పూర్ణ ఫలాన్ని ప్రసాదిస్తుందని భక్తుల విశ్వాసం.

Related posts