telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

చైత‌న్య పోలోజుకు మిసెస్ భార‌త్ న్యూయార్క్‌-2019

Mrs Bharath New York-2019 Chaitanya Poloju

అమెరికాలో ప్రతి సంవత్సరం అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే మిసెస్ భారత్ న్యూయార్క్ 2019 పోటీలలో ఈ సంవత్సరానికిగానూ తెలుగు మహిళ చైతన్య పోలోజు విజేత‌గా నిలిచారు. ఈ కార్యక్రమం అమెరికాలోని న్యూయార్క్ నగరంలో జరగగా… ప్రముఖ బాలీవుడ్ నటి షమితా శెట్టి ముఖ్య అతిథిగా పాల్గొన‌గా, మై డ్రీం ఎంటర్ టైన్మెంట్ రష్మి బేడి, జనక్ బేడి త‌దిత‌రులు అతిథులుగా పాల్గొన్నారు.

 

ఈ సంద‌ర్భంగా చైతన్య మాట్లాడుతూ.. “ఏళ్ళ తరబడి అమ్మాయి అంటే వంటింటికి, పెళ్ళికి మాత్రమే పరిమితమని, కట్నం తెచ్చే వస్తువుగా వున్న భావనను దూరం చేయాలని, తన తండ్రి శ్రీ ఆంజనేయులు పోలోజు, భర్త సాయి రాం గారి సహకారంతో ఈ పోటీలలో పాల్గొన్నాను. తన ఆశయాలను పది మందికి ఉపయోగపడే విధంగా విస్తరింపచేస్తాను” అని పేర్కొన్నారు. ఈ కిరీటాన్ని ప్రపంచంలోని యావత్ బాలికలకు, మహిళ‌ల‌కు అంకిత మిస్తున్నట్లుగా చైతన్య తెలిపారు. ఈ పోటీలో మొదటి రన్నర‌ప్‌గా కిస్మత్ బైన్స్ చాహాల్, రెండవ రన్నరప్‌గా సీమా సింగ్ గెలుపొందారు. 

Related posts