telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

పాక్ సైనికులే ఉగ్రవాదులుగా.. భారత సైన్యంపై దుష్ప్రచారం..

pak fake news about indian army in pok

పాక్ లో ఉగ్రమూకలు ఆ దేశాన్ని ప్రపంచానికి శత్రువుగా పరిచయం చేస్తుందని ఇప్పటివరకు అనుకున్నాం, కానీ అదినిజం కాదని తాజా పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. పాక్ సైనికులే అనేక రూపాలలో భారతదేశంలో ప్రవేశించి విధ్వంసానికి కుట్రలు పన్నుతున్నట్టు ఇప్పటికే దేశవ్యాప్తంగా ఇంటెలిజెన్స్ హెచ్చరికలు జారీచేసింది. ఈ నేపథ్యంలోనే పాక్ సైన్యం మరో అడుగు ముందుకు వేసి భారత సైన్యం విధ్వంసాలకు పాల్పడుతున్నట్టుగా తప్పుడు వీడియోలు, వార్తలతో దుష్ప్రచారం చేస్తుంది. ఇవన్నీ చూస్తుంటే, తప్పు తీవ్రవాదుల ప్రమేయంతో జరుగుతున్నట్టుగా కాకుండా కేవలం పాక్ భారత్ పై పెట్టుకున్న కక్షతోనే ఈ కుట్రలన్నీ చేస్తున్నట్టు స్పష్టం అవుతుంది. ఇక పాక్ ని ఉపేక్షిస్తే అది అతిమంచితనంతో భారత్ చేసిన అతిపెద్ద తప్పుగా పరిణమిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే పాక్ జమ్మూ-కాశ్మీర్‌లో పరిస్థితులపై సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు, వీడియోలు పోస్టు చేసి భారత సైన్యం, ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తోందని, భారత సైన్యం దారుణాలకు పాల్పడుతోందని తప్పుడు ప్రచారం చేస్తోంది.

భారత సైనికుల తరహా యూనిఫాంను ధరించిన వ్యక్తులతో సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు, ఆకృత్యాలకు పాల్పడుతున్నట్లు వీడియోలను చిత్రీకరిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతోంది. దీని కోసం పాకిస్థాన్ సైన్యం ఓ కంట్రోల్ రూంను కూడా ఏర్పాటు చేసుకోవడం గమనార్హం. పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే) కేంద్రంగా ఈ కుట్రలు చేస్తోంది పాకిస్థాన్. జమ్మూకాశ్మీర్‌లో భారత సైన్యం ఆకృత్యాలకు పాల్పడుతోందంటూ ప్రపంచాన్ని నమ్మించేందుకు ఈ దొంగ నాటకాలు ఆడుతోంది. ఈ వ్యవహారాన్ని గుర్తించిన భారత్.. పాకిస్థాన్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ దొంగ వ్యవహారాలను ఆపేయాలని హెచ్చరించింది.

గత కొంత కాలంగా పాక్ ఈ దుష్ప్రచారం పన్నాగాన్ని అమలు చేస్తోందంటూ భారత్ పేర్కొంది. జమ్మూకాశ్మీర్‌లోనే ఆ ఆకృత్యాలు జరుగుతున్నట్లు చిత్రీకరిస్తున్న పాక్.. సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారని మండిపడింది. గూగుల్, ఫేస్‌బుక్ లాంటి సోషల్ మీడియా సంస్థలు వెంటనే అలాంటి ఫేక్ వీడియోలను తొలగించాలని భారత హోంమంత్రిత్వశాఖ సూచించింది. జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక ప్రత్తిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాకిస్థాన్.. భారత్ అక్కసును వెళ్లగక్కుతోంది. ఇది భారత అంతర్గత విషయమైనప్పటికీ ప్రపంచంలోని పలు దేశాల మద్దతు కూడ గట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఎవరూ మద్దతుగా నిలవకపోవడంతో ఐక్యరాజ్యసమితినీ ఆశ్రయించింది. అక్కడ కూడా నిరాశే ఎదురవుతుండటంతో ఇలాంటి నకిలీ వీడియోలతో దొంగ పనులు చేస్తోంది.

Related posts