ఈ రోజు ఐపీఎల్ 2020 లో అబుదాబి వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఇందులో టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ అయ్యర్ బౌలింగ్ ఎంచుకోవడంతో ఆర్సీబీ మొదట బ్యాటింగ్ చేయనుంది. అయితే ఈ రెండు జట్లకు ఈ మ్యాచ్ చాలా కీలకం. ఎందుకంటే… ప్రస్తుతం ఈ రెండు జట్లు 14 పాయింట్లతో వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. కాబట్టి ఈ మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తే వారే టాప్ 2 లో ఛాన్స్ దక్కించుకుంటారు. అయితే మరి ఈ మ్యాచ్ లో ఏ జట్టు విజయం సాధిస్తుంది అనేది చూడాలి.
బెంగళూరు : జోష్ ఫిలిప్, దేవదత్ పాడికల్, విరాట్ కోహ్లీ (c), ఎబి డివిలియర్స్ (w), వాషింగ్టన్ సుందర్, శివం దుబే, షాబాజ్ అహ్మద్, క్రిస్ మోరిస్, ఇసురు ఉదానా, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్
ఢిల్లీ : శిఖర్ ధావన్, పృథ్వీ షా, అజింక్య రహానె, శ్రేయాస్ అయ్యర్ (c), రిషబ్ పంత్ (w), మార్కస్ స్టోయినిస్, డేనియల్ సామ్స్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, కగిసో రబడా, అన్రిచ్ నార్ట్జే