telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

సోమశిల రెండో దశకు నేడు శ్రీకారం చుట్టనున్న సీఎం జగన్

cm jagan

ఏపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు, అభివృద్ధిలో దూసుకుపోతున్నది. పాలనలో సీఎం జగన్ తనదైన ముద్ర వేస్తున్నారు. అన్ని రంగాల వారికీ సంక్షేమ పథకాలు అందిస్తోంది జగన్ ప్రభుత్వం. తాజాగా ఇవాళ మరో కార్యక్రమానికి స్వీకారం తుట్టనున్నారు సీఎం జగన్. సోమశిల రెండో దశకు నేడు సీఎం జగన్ శ్రీకారం చుట్టనున్నారు. ఈ కార్యక్రమాన్ని తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి వర్చువల్‌ విధానంలో శంకుస్థాపన చేయనున్నారు సీఎం జగన్. సోమశిల హైలెవల్‌ లిఫ్ట్‌ కెనాల్‌ రెండో దశతో 46,453 ఎకరాలకు నీళ్లు అందనున్నాయి. దీంతో ఆ ప్రాంత రైతులు చాలా లబ్ది పొందనున్నారు. ఈ కార్యమానికి నెల్లూరు జిల్లా నుండి మంత్రులు, ఎమ్మెల్యేలు అధికారులు తదితరులు పాల్గొననున్నారు. కాగా తొలి దశ కింద 43,547 ఎకరాలకు నిర్ణయించింది ఏపీ ప్రభుత్వం. రూ.840.72 కోట్ల వ్యయం కాగల పనులను కాంట్రాక్టు సంస్థకు అప్పగించింది. ఇప్పటివరకు రూ.572.11 కోట్లను ఖర్చు చేసింది. అటవీ శాఖకు చెందిన 4 . 28 ఎకరాల భూమిని సేకరించే ప్రక్రియ పూర్తి చేసి..మిగిలిన పనులను శరవేగంగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టింది.

Related posts