రేపటి నుంచి ఈ నెల 27 వరకు మావోయిస్టు 16వ ఆవిర్భావ వారోత్సవాలు జరగనున్న సందర్భంగానే తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. రోడ్డు తనిఖీల్లో భాగంగా రోడ్డు పక్కన మావోయిస్టులు పాతిపెట్టిన మూడు మందు పాతరలను గుర్తించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలివేరు-తేగడ గ్రామాల మధ్య మావోయిస్టులు వీటిని అమర్చారు.
ఈ క్రమంలో మందుపాతరలను పోలీసులు నిర్వీర్యం చేశారు. దీంతో తేగడ క్రాస్‌రోడ్, కలివేరు గ్రామాల మధ్య గంటన్నరపాటు పోలీసులు రాకపోకలు నిలిపివేశారు. మందుపాతరలను తొలగించిన అనంతరం పోలీసు, బాంబ్ స్క్వాడ్ బృందాలు వాటిని సమీపంలో పేల్చివేశాయి. వారోత్సవాలు జరగనున్న సందర్భంగానే వీటిని ఏర్పాటు చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.