telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఆధార్ సవరణలకు .. ఆమోదం.. కేంద్ర క్యాబినెట్ ..

aadhar

ఆధార్ బయోమెట్రిక్ డాటాను రాష్ట్ర ప్రభుత్వాలు తమ పథకాల నిర్వహణకు వినియోగించుకునేందుకు కేంద్రం అనుమతించింది. ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర క్యాబినెట్ సమావేశమైంది. ఈ సందర్భంగా తీసుకున్న నిర్ణయాలను కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ మీడియాకు వివరించారు. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల్లోని లబ్ధిదారుల ఆధార్ బయోమెట్రిక్ వివరాలను రాష్ట్ర ప్రభుత్వాలు వినియోగించుకోవచ్చని ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు ఆధార్ ఇతర చట్టాల (సవరణ) బిల్లులో మార్పులకు ఆమోదం తెలిపామన్నారు.

ఈ మార్పులు లబ్ధిదారులకు మరింత ప్రయోజనకరంగా ఉంటాయని జవదేకర్ చెప్పారు. సబ్సిడీలు, రుణాలు ఇతర ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయని చెప్పారు. కేంద్రం వద్ద చెక్కర నిల్వలను 40 లక్షల టన్నులకు పెంచాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. ఇందుకోసం రూ.1,674 కోట్లు వ్యయం చేయనున్నట్టు చెప్పారు. ఇది చెరుకు రైతులకు ప్రయోజనకరంగా మారుతుందని చెప్పారు. గత ఏడాది రూ.1,175 కోట్లతో 30 లక్షల టన్నుల చెక్కర నిల్వ చేశామని, ఈసారి 10 లక్షల టన్నులు పెంచుతున్నామని వెల్లడించారు.

Related posts