telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

రేపటినుండి ప్రారంభం కానున్న పుష్ప షూటింగ్..

Pushpa

ఈ ఏడాది ‘అల వైకుంఠపురములో’ సినిమా తో బ్లాక్ బాస్టర్ అందుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో బన్నీకి జోడిగా రష్మిక మందన్న నటిస్తుంటే… దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ కరోనా మహమ్మరి కారణంగా ఆగిపోయింది. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ ను మళ్ళీ ప్రారంభించడానికి సిద్ధమైంది పుష్ప టీం. దీనికి సంబంధించిన ఓ మేకింగ్ వీడియోను విడుదల చేస్తూ నవంబర్ 10 అంటే రేపటినుండి పుష్పా షూట్ ప్రారంభమవుతుంది అని తెలిపింది చిత్రబృందం. అయితే ఈ సినిమా అంతా ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో జరుగుతుంది. ఇందులో లారీ డ్రైవర్ పాత్రలో నటిస్తున్నాడు బన్నీ. అయితే ఈ సినిమా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో సాగే కథతో రూపొందుతుండడం వల్ల ముందుగా కేరళ అడవుల్లో ఈ సినిమాను షూట్ చేయాలనుకున్నారు. కానీ కరోనా కారణంగా కేరళ షడ్యూల్ క్యాన్సిల్ అయ్యింది. కానీ ఇప్పుడు గోదావరి జిల్లాల్లోని అటవీ ప్రాంతంలో షూటింగ్ చేయాలని నిర్ణయించింది చిత్రబృందం.

Related posts