telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్

బ్రౌన్ రైస్ మీ డైట్ లో భాగమైతే ఈ వ్యాధులు దరిచేరవు…!

Brown-Rice

మనం ఆహారంగా తీసుకునే వరి, గోదుమలు శరీరానికి ఎంతో ఎనర్జీని అందిస్తాయి. అయితే శరీరానికి కార్బోహైడ్రేట్లు అధికమైతే మేలు కంటే కీడే ఎక్కువ. ఈ నేపథ్యంలో అప్పుడప్పుడు వైట్ రైస్‌కు ప్రత్యమ్నాయ ఆహారాన్ని కూడా తీసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా తృణధాన్యాల్లో ముఖ్యమైన బ్రౌన్ రైస్‌ను తప్పకుండా ప్రయత్నించండి. ఎందుకంటే.. బ్రౌన్ రైస్‌లో బోలడన్ని పోషకాలు ఉన్నాయి. తక్కువ కేలరీలు.. ఎక్కువ ఫైబర్లు అందించే ఈ బ్రౌన్ రైస్‌లో ఇంకా మెగ్నీషియం, పాస్పరస్, థయామిన్, నియాసిన్, పాస్పరస్, విటమిన్ B6 వంటి ములాలు కూడా ఉన్నాయి. బ్రౌన్ రైస్‌లోని మెగ్నీషియం, కాల్షియం వల్ల ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. ఒక కప్పు బ్రౌన్‌రైస్‌‌లో 21 శాతం మెగ్నీషియం ఉంటుంది. మతిమరుపు, అల్జీమర్స్, డిమోన్షియా లాంటి వ్యాధులను సైతం ఇది దూరం చేస్తుంది. బ్రౌన్ రైస్ వల్ల అధిక బరువు నియంత్రణలో ఉంటుంది. గుండెపోటు, చక్కెర వ్యాధికి కారణమయ్యే మెటబాలిక్ సిండ్రోమ్‌ను బ్రౌన్ రైస్ నియంత్రిస్తుంది. ఊపిరిత్తుల వ్యాధి ఉబ్బసాన్ని సైతం బ్రౌన్‌రైస్ నియంత్రిస్తుంది. వారానికి రెండు నుంచి మూడు రోజులు బ్రౌన్‌రైస్ తినేవారిలో ఆస్తమా ముప్పు 50 శాతం తగ్గుతుందని ఆహార నిపుణులు చెబుతున్నారు. రోజుకు 50 గ్రాముల బ్రౌన్‌రైస్ తీసుకుంటే మధుమేహం (డయాబెటిస్) ముప్పు 16 శాతం తగ్గుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు శరీరంలో చక్కెర నియంత్రణకు బ్రౌన్‌ రైస్‌ను వారానికి రెండు లేదా మూడు రోజులు తీసుకున్నా చాలు. బ్రౌన్ రైస్‌లో ‘ఫైటోన్యూట్రియంట్స్’ ఉంటాయి. ఇవి యాంటీ-ఆక్సిడెంట్స్‌గా పని చేస్తాయి. ఫలితంగా ‘ఆక్సిడేషన్ మీడియెటెడ్’ వ్యాధులు దరి చేరవు.

Related posts