తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు గవర్నర్ నరసింహన్ తో భేటీ అయ్యారు. నేడు శాసనసభ వాయిదా పడిన అనంతరం నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లిన కేసీఆర్ ఆయనతో కాసేపు సమావేశమయ్యారు. ఇరువురి మధ్య రాష్ట్రంలోని తాజా పరిణామాలపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశానంతరం కేసీఆర్ గవర్నర్ ను భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
శాసనసభ ప్రత్యేక సమావేశాలు, కొత్త పురపాలక చట్టం, పురపాలక ఎన్నికలు తదితర అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకూ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎత్తిపోసిన నీటి వివరాలను కూడా కేసీఆర్ గవర్నర్‌కు వివరించినట్టు సమాచారం. ఏపీకి ప్రత్యేక గవర్నర్ నియామాకం తర్వాత ఈ భేటీ కావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
సెంటు పట్టా పథకంలో దోపిడీ: దేవినేని