విజయ్ దేవరకొండ సినిమాలో బాలీవుడ్ స్టార్ నటించనున్నట్లు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం విజయ్ దేవరకొండ టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరీజగన్నాద్ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈసినిమాకు “ఫైటర్” అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఛార్మి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాతో విజయ్ దేవరకొండ బాలీవుడ్ ఇండస్ట్రీకి… అనన్య పాండే టాలీవుడ్ ఇండస్ట్రీకి ఒకేసారి పరిచయం అవుతున్నారు. ఇప్పటికే సినిమాలోని మెజారిటీ పార్టీ ముంబైలోనే చిత్రీకరించారు. ఈ కథ నచ్చి బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ ఇందులో భాగస్వామ్యమయ్యారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రస్టింగ్ వార్త ఇప్పుడు ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమా కోసం ఇటీవలే ఓ స్టార్ యాక్టర్ తో సంప్రదింపులు జరిపారటపూరి . ఆయనే బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి. ఫ్లాష్ బ్యాక్ లో విజయ్ తండ్రిగా సునీల్ శెట్టి నటిస్తున్నారని ఆయనది డాన్ క్యారెక్టర్ పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఆయన లెంగ్త్ ఓ 15 నిమిషాలపాటు ఉండొచ్చని సమాచారం. ఇక సునీల్ ఈ ఏడాది దర్బార్ సినిమాలో రజినీకి విలన్ గా మెప్పించిన విషయం తెలిసిందే. అలాగే మంచు విష్ణు నటిస్తున్న మోసగాళ్లు సినిమాలో ను కనిపించనున్నారు.
previous post