telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

నెయిల్‌ పాలిష్‌ వాడుతున్నారా..!

మొదటి నుంచి నెయిల్‌ పాలిష్‌ ఎక్కువగా మహిళలు పెట్టుకుంటారు. తమ చేతులను అందంగా ఉంచుకోవడంలో భాగంగా ఈ నెయిల్‌ పాలిష్‌లను వాడుతారు. అందులో వెరైటీ కలర్స్‌ను వాడుతుంటారు మగువలు. అయితే.. ఫ్యాషన్‌ పరంగా ముందు వరుసలో ఉన్నప్పటికీ ఆరోగ్యం పరంగా చూసుకుంటే నెయిల్‌ పాలిష్‌ వల్ల ప్రమాదమే ఉంటుందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. నెయిల్‌ పాలిష్‌ల వల్ల అధికంగా బరువు పెరిగే అవకాశం ఉంటుందని సైంటిస్టులు చేపట్టిన తాజా పరిశోధనల్లో తేలింది. ఏ నెయిల్‌ పాలిష్‌లోనైనా సరే.. ట్రైఫెనైల్‌ ఫాస్పేట్‌ అనే కెమికల్‌ ఉంటుంది. ఇది చర్మానికి అంటినప్పుడు మన శరీరంలోని హార్మోన్లు ప్రభావితం అవుతాయి. దీనివల్ల మనం అధికంగా బరువు పెరుగుతామని సైంటిస్టులు చెబుతున్నారు. మార్కెట్‌లో అందుబాటులో ఉన్న 3 వేల రకాలకు పైగా పాలిష్‌ లను సైంటిస్టులు పరీక్షించారు. ఈ క్రమంలో 49 శాతం వరకు నెయిల్‌ పాలీష్‌లలో పైన చెప్పిన కెమికల్‌ ఉందని తేల్చారు. కనుక వాటిని వాడేవారు ఇక ఆలోచించుకోండి.

Related posts