telugu navyamedia
తెలంగాణ వార్తలు

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు స్వల్ప అస్వస్థత..

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. ఆయ‌న‌ వెంటనే సోమాజిగూడ యశోద ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. కేసీఆర్‌కు యాంజియోగ్రామ్, సిటీ స్కాన్ఇతర వైద్య పరీక్షలు చేయించుకోనున్నారు. కేసీఆర్‌ వెంట ఆయన సతీమణి, కుమార్తె, మనుమడు, ఎంపీ సంతోష్‌ ఉన్నారు.

CM KCR remain in yashoda hospital for more medical tests, if necessary admits in hospital says Doctors

కేసీఆర్ ఆరోగ్యంగానే…

సీఎంకు ఏటా ఫిబ్రవరిలో సాధారణ చెకప్ చేస్తాం. ..రెండురోజులుగా సీఎం కేసీఆర్‌ వీక్‌గా ఉన్నారని, ఎడమ చేయి లాగుతోందని చెప్తున్నారని డాక్టర్‌ ఎంవీ రావు వెల్లడించారు. ప్రస్తుతం సీఎం కేసీఆర్‌కు వైద్యపరీక్షలు నిర్వహించినట్లు వైద్యులు చెబుతున్నారు. రిపోర్టులు వచ్చాక ఆరోగ్య పరిస్థితిపై పూర్తి సమాచారం వెల్లడిస్తామన్నారు.

ఈ పరీక్షలను బట్టి ఒకవేళ అవసరం అనిపిస్తే హాస్పిటల్‌లో అడ్మిట్ చేసుకుంటామని కూడా ఎంవీ రావు వెల్లడించారు. దాదాపు 20 మంది వేర్వేరు స్పెషలిస్టుల టీమ్ ముఖ్యమంత్రికి మెడికల్ టెస్టులు చేస్తోంది. డాక్టర్ ప్రమోద్ కుమార్ నేత్రుత్వంలో ఈ పరీక్షలు చేశారు.

ఈ విషయం తెలుసుకున్న మంత్రులు కేటీఆర్, హరీశ్​ సైతం.. సోమాజిగూడ యశోద ఆస్పత్రికి చేరుకున్నారు. అస్వస్థత కారణంగా నేటి యాదాద్రి పర్యటనను సీఎం రద్దు చేసుకున్నారు. ఇటీవల దిల్లీలో కూడా కేసీఆర్ వైద్య పరీక్షలు చేయించుకున్నారు..

Related posts