telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

అందుకే కనీస ఆదాయ మద్దతు పథకం: రాహుల్

rahul gandhi to ap on 31st

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కర్నాటకలోని కోలార్‌‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ రూ.15 లక్షల చొప్పున ప్రజల బ్యాంకు ఖాతాలకు జమ చేస్తామని చెప్పిందని, ఇదంతా అబద్ధమని తేలిపోయిందని చెప్పారు. 5 నెలల క్రితం తనకు ఓ ఆలోచన వచ్చిందని, . అందుకే కనీస ఆదాయ మద్దతు పథకాన్ని రూపొందించామని తెలిపారు. పేదలకు ఏటా రూ.72,000 అందజేయడమే ఈ పథకం ఉద్దేశమని పేర్కొన్నారు.

తాము ఈ పథకంపై నిర్ణయం తీసుకున్న వెంటనే కాపలాదారు ముఖం మారిపోయిందన్నారు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికలు రెండు భావజాలాల మధ్య జరుగుతున్నాయని చెప్పారు. అందరి అభివృద్ధి, సమైక్యత గురించి మాట్లాడే కాంగ్రెస్ పార్టీ ఓ వైపు కాగా, ప్రజలను విభజించడాన్నే నమ్ముకున్న బీజేపీ మరోవైపు అని తెలిపారు. తాము పనికి సంబంధించిన మాటలు మాట్లాడతామని చెప్పారు. తమవి చేతల మాటలని రాహుల్ పేర్కొన్నారు.

Related posts