telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

సిద్ధిపేట అంటే నాకు ప్రాణం : కేసీఆర్

telangana cm kcr on CAA

ఈరోజు సీఎం కేసీఆర్ సిద్ధిపేటలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా… భాగంగా ప్రభుత్వ డిగ్రీ కాలేజీ గౌండ్ లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు.  ఈ సభలో మంత్రి హరీష్ రావు పై కేసీఆర్ ప్రశంసలు కురిపించారు.  సిద్ధిపేట అంటే నాకు ప్రాణం.  ఉద్యమ సమయం నుంచి ఇప్పటిదాకా సిద్ధిపేట నాకు అండగా ఉంది.  సిద్ధిపేట లేకపోతె కేసీఆర్ లేడు అని, కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదని అన్నారు.  సిద్ధిపేటలోనే ఏదో బలం ఉందని అన్నారు.  సిద్ది పొందిన పేట అని ప్రసిద్ధి అని తెలిపారు.  సిద్ధిపేటకు తనలా పనిచేసే ఆణిముత్యంలాంటి హరిసి ను ఇచ్చానని అన్నారు.  ఆరేళ్ళ కాలంలో కరెంటు బాధలు, నీళ్ల బాధలు పోయాయని అన్నారు.  ఇక సిద్ధిపేట స్కీమే రాష్ట్రానికి విస్తరించిందని, దానిపేరే మిషన్ భగీరథ అని అన్నారు.  రంగనాయక సాగర్ ను టూరిస్ట్ హబ్ గా తీర్చి దిద్దుతామని అన్నారు.  సిద్దిపేటకు మరో వెయ్యి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు కావాలని అన్నారని, తప్పకుండా వాటిని సిద్దిపేటకు మంజూరు చేస్తామని అన్నారు.  సిద్ధిపేట ఇండియాకు రోల్ మోడల్ గా మారుతుందని పేర్కొన్నారు.  

Related posts