telugu navyamedia
ఆంధ్ర వార్తలు

కేటీఆర్ స‌వాల్‌ను స్వీక‌రించిన జనసేన అధినేత పవన్..

*కేటీఆర్ స‌వాల్‌ను స్వీక‌రించిన జనసేన అధినేత పవన్
*జాతీయ చేనేత దినోత్స‌వ సంద‌ర్భంగా..
*చేనేత వ‌స్ర్తాలు ధ‌రించిన ఫోటోలు ట్వీట్ చేసిన ప‌వ‌న్‌
*చంద్ర‌బాబు, బాలినేని, డా.ల‌క్ష్మ‌ణ్‌కు ప‌వ‌న్ చేనేత స‌వాల్‌..

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నేతల ఆస‌క్తిక‌ర చ‌ర్చ మొద‌లైంది. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ మంత్రి కేటీఆర్ కేటీఆర్ చేనేత కళాకారులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సంద‌ర్భంగా  జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, పారిశ్రామిక వేత్త ఆనంద మహేంద్ర, క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌కు ట్విటర్ వేదికగా  ఛాలెంజ్ విసిరారు. చేనేత వస్త్రాలు ధరించి ఫోటోలు పోస్ట్ చేయాలని  కోరారు. 

కేటీఆర్ విసిరిన‌ ఛాలెంజ్ ను జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్వీకరించారు. .ఆయన మరో ముగ్గురికి ఛాలెంజ్ ను విసిరారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ లకు ఆయన ఛాలెంజ్ విసిరారు.

రామ్‌ భాయ్‌ ఛాలెంజ్ స్వీకరించా అంటూనే టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ను నామినేట్ చేశానంటూ ట్వీట్‌ చేశారు. దీనికి థ్యాంక్స్‌ పవన్ కల్యాణ్‌ అన్న అని రిప్లయ్‌ ఇచ్చారు. అయితే పవన్‌ కల్యాణ్‌.. చంద్రబాబుకి చేనేత ఛాలెంజ్ విసరడం మాత్రం హాట్‌ టాపిక్‌గా మారింది

Related posts