telugu navyamedia
తెలంగాణ వార్తలు

తెలంగాణ అభివృద్ధి చెందాలంటే అధికార మార్పు అవ‌స‌రం

*బీజేపీ కండువా కప్పుకున్న దాసోజు శ్రవణ్
*తెలంగాణ అభివృద్ధి చెందాలంటే అధికార మార్పు అవ‌స‌ర‌మ‌ని
*చికోటి వెనుక ఉన్న‌ది మొత్తం టీఆర్ ఎస్ నేత‌ల‌నే
*టీఆర్ ఎస్ నేత‌ల‌నే విచ్చ‌విడిగా దోచుకుంటున్నారు..
*అప్పులు తెలంగాణ‌గా మ‌ర్చారు..

తెలంగాణ అభివృద్ధి చెందాలంటే అధికార మార్పు అవసరమని దాసోజు శ్రవణ్ అన్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వైఖరి మూలంగానే తాను కాంగ్రెస్ ను వీడిన‌ట్లు చెప్పిన దాసోజు శ్రవణ్‌ ఆదివారం ఢిల్లీలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ తరుణ్‌ చుగ్‌ సమక్షంలో బీజేపీ తీర్థంపుచ్చుకున్నారు. ఈ సంద‌ర్భంగా మీడియా మాట్లాడుతూ..తెలంగాణలో చికోటి ప్రవీణ్‌ లాంటి వారు ఎందరో ఉన్నారని ఆరోపించారు.

Thumbnail image

చికోటి వెనక ఉన్నది మొత్తం టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులేనని దాసోజు శ్రవణ్ ఆరోపణ చేశారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలే విచ్చలవిడిగా దోచుకున్నారని, అప్పుల తెలంగాణగా మార్చారని విమర్శించారు.

రాష్ట్రం తెచ్చుకున్న లక్ష్యం దారి తప్పిందని, కేసీఆర్‌ను గద్దె దించాల్సిన సమయం దగ్గరలోనే ఉందని ఆయన చెప్పారు. . గతంలో తాను ఆర్ఎస్ఎస్ ప్రచారక్​గా పని చేశానని.. ఇప్పుడు సొంతింటికి వచ్చినట్లుగా ఉందని దాసోజు శ్రవణ్ అన్నారు. వందల మంది త్యాగాలతో ఏర్పడిన తెలంగాణను సీఎం కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చారని మండిపడ్డారు.

భవిష్యత్​లో పుట్టే పిల్లలపైనా అప్పుల భారం పడనుందని.. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణలో లక్షల కోట్లు అప్పులు చేశారని విమర్శించారు. సుపరిపాలన కోసం రాజకీయాల్లోకి వచ్చానని బీజేపీ నేత దాసోజు శ్రవణ్ చెప్పుకొచ్చారు

Related posts