telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఏపీ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి హఠాన్మరణం

*ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం
*గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన మేకపాటి గౌతమ్‌రెడ్డి
* హైదరాబాద్‌ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గౌతమ్‌రెడ్డి మృతి
*ఆస్ప‌త్రికి తీసుకొచ్చేలోపే గౌతమ్‌రెడ్డి మృతి చెందిన‌ట్లు వైద్యులు తెలిపారు..
*పోస్ట్ కొవిడ్ ప‌రిణామాలే గుండెపోటుకు కార‌ణం కావ‌చ్చ‌ని అనుమానం..
*రెండ్రోజుల క్రితం దుబాయ్‌ నుంచి వచ్చిన మేకపాటి గౌతమ్‌రెడ్డి
*వారం రోజులపాటు దుబాయ్‌ ఎక్స్‌పోలో పాల్గొన్న గౌతమ్‌రెడ్డి
*ఏపీ పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రిగా ఉన్న గౌతమ్‌రెడ్డి
*2014, 2019లో నెల్లూరు జిల్లా ఆత్మకూరు నుంచి గెలుపొందిన గౌతమ్‌రెడ్డి

వైసీపీ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి  ఈ ఉదయం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను హైదరాబాద్‌లోని అపోలో అస్పత్రిలో చేరారు. అయితే ఆస్ప‌త్రికి తీసుకొచ్చేలోపే గౌతమ్‌రెడ్డి మృతి చెందిన‌ట్లు వైద్యులు తెలిపారు. వారం రోజుల దుబాయి పర్యటన ముగించుకొని ఆదివారమే హైదరాబాద్‌ చేరుకున్నారు.

కాగా గౌతమ్‌ రెడ్డి పోస్ట్ కొవిడ్ ప‌రిణామాలే గుండెపోటుకు కార‌ణం కావ‌చ్చ‌ని అనుమానం వ్య‌క్తం చెందుతున్నారు.

నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి కుమారుడు గౌతమ్‌రెడ్డి. 1971 నవంబర్‌2న జన్మించిన మేకపాటి గౌతమ్‌రెడ్డి ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్‌ యూనివర్సిటీ నుంచి ఎమ్మెస్సీ పూర్తి చేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికలతో గౌతమ్‌ రెడ్డి రాజకీయ అరంగేట్రం చేశారు. నెల్లూరు జిల్లా అత్మకూరు నియోజకవర్గం నుంచి తొలిసారి పోటీ చేసి గెలుపొందారు.

2019లో రెండోసారి ఆత్మ‌కూరి నుంచి ఎన్నికైయ్యారు. అయితే వారం రోజులపాటు దుబాయ్‌లో పర్యటించిన మేకపాటి ఆదివారమే హైదరాబాద్‌కు తిరిగొచ్చారు. ఇటీవలే కోవిడ్‌ బారిన పడి కూడా కోలుకున్నారు. మేక‌పాటికి భార్య ఇద్ద‌రు కుమార్తెలు ఉన్నారు.

Related posts