జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ కు తృటిలో ప్రమాదం తప్పింది. ఓ అభిమాని అత్యుత్సాహంతో పవన్ పైకి ఒక్కసారిగా దూసుకొచ్చాడు. దీంతో అభిమానులకు అభివాదం చేస్తున్న పవన్ కారుపై ఒక్కసారిగా పడిపోయారు.
పవన్ కల్యాణ్ రసాపురంలో నిర్వహించే మత్స్యకార అభ్యున్నతి సభ లో పాల్గొనేందుకు రోడ్డు మార్గం ద్వారా రాజమహేంద్రవరం నుంచి నర్సాపురం ర్యాలీగా బయలుదేరారు. అయితే ఈ సభకు భారీ ఎత్తున జనం హాజరయ్యారు. పవన్ అభిమానులు ఆయనను చూడడానికి, సభలో పాల్గొనడానికి భారీ సంఖ్యలో సభకు వచ్చారు.
అయితే.. అభివాదం చేస్తూ వస్తున్న పవన్ అందరికీ కన్పించాలన్న ఉద్దేశ్యంతో కారుపైకి ఎక్కారు. అయితే అక్కడ అనూహ్యంగా ఓ అభిమాని కారుపైకి ఎక్కి పవన్ ను కౌగిలించుకోబోయాడు. కానీ అంతలోనే ఓ బాడీ గార్డు అది గమనించి, సదరు అభిమానిని పట్టుకుని లాగాడు. కానీ అప్పటికే ఆ వ్యక్తి పవన్ ని పట్టుకోవడం, బాడీ గార్డు లాగడంతో సపోర్ట్ కోసం పవన్ ను పట్టుకోవడం, పట్టుకోల్పోయి అతను కిందకు దూకడం జరిగింది.
ఆ సమయంలో మధ్య పవన్ కారుపైనే జారి పడిపోయాడు. ఈ క్రమంలో అభిమానులకు పవన్ క్లాస్ పీకారు. అరుపులు కేకలతో అధికారం రాదు.. అందరిని గౌరవించాలని పవన్ సూచించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
#JSPForFisherman
ఇలాంటి చెత్త ఎదవ ల కోసమే పాదయాత్ర చేయడానికి భయపడేది అభిమానం అంటే ఆయనకి ఏమి కాకుండా చూసుకోవడం మన వల్ల ఆయన ని ఇబ్బంది పెట్టడం కాదు…#PawanKalyan pic.twitter.com/2Z1xsIvEZb— Sathish koppineedi (@svksathish) February 20, 2022