జగన్ కారణంగా ఎంతోమంది జైలుకు వెళ్లారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. వైసీపీ అధినేత జగన్ ఓ అవినీతి చక్రవర్తి అని చంద్రబాబు విమర్శించారు. అమరావతిలో ఈరోజు టీడీపీ నేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అవినీతి పరులే ప్రస్తుతం అవినీతిపై పుస్తకాలు వేస్తున్నారని ఎద్దేవా చేశారు. జయప్రకాశ్ కమిటీ ఏపీకి రూ.75,000 కోట్లు రావాలని చెప్పిందనీ, ఈ విషయంలో జగన్ ఎందుకు మౌనంగా ఉన్నారని చంద్రబాబు ప్రశ్నించారు. ఏపీ అభివృద్ధి విషయంలో రాజీలేని పోరాటం చేస్తున్నామని స్పష్టం చేశారు.
కేంద్రం ప్రభుత్వం తీసుకువచ్చిన ఈబీసీ బిల్లుపై స్పందిస్తూ.. మంచికోసం రిజర్వేషన్ బిల్లు తెస్తే స్వాగతిస్తామని వెల్లడించారు. అయితే ఇందుకోసం ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్ కు గండి కొడతామంటే మాత్రం పోరాటం చేస్తామని తెలిపారు. దేశంలో ఇంతవరకు సామాజిక అసమానతలు, వెనుకబాటుతనం తొలగించేందుకే రిజర్వేషన్లు ఉన్నాయని చంద్రబాబు తెలిపారు. అయితే ఇప్పడు ఆర్థిక వెనుకబాటుతనం నిర్మూలనకు కొత్తగా రిజర్వేషన్లు తెచ్చారని వ్యాఖ్యానించారు.
ఉద్యోగ సంఘాలకు మాట్లాడే పరిస్థితి లేదు: జీవన్‌రెడ్డి