telugu navyamedia
వార్తలు వ్యాపార వార్తలు సామాజిక

కరోన ఎఫెక్ట్ .. దినప‌త్రిక‌ల ముద్ర‌ణ‌ నిలిపివేత

News papers Australia

కరోన వైర‌స్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆస్ట్రేలియాలో సుమారు 60 ప్రాంతీయ దిన‌ప‌త్రిక‌లు ముద్ర‌ణ‌ను నిలిపివేశాయి. వైర‌స్ వ‌ల్ల ప్రింట్ ఎడిష‌న్‌ను ఆపివేస్తున్న‌ట్లు ఆ న్యూస్‌పేప‌ర్లు వెల్ల‌డించాయి. మీడియా గ్రూపు న్యూస్ కార్ప్ ఈ విష‌యాన్ని తెలియ‌జేసింది.

ఇక ఆన్‌లైన్‌లో మాత్రం త‌మ వార్త‌లు ఉంటాయ‌ని ఆ ప‌త్రిక‌లు పేర్కొన్నాయి. ఇదేమీ చిన్న నిర్ణ‌యం కాదు అని, ఇప్ప‌టికే ప్రింట్ రంగం ఇబ్బందులు ఎదుర్కొంటోంద‌ని, ఇక అడ్వ‌ర్ట‌యిజింగ్ కూడా ప‌డిపోవ‌డంతో ఈ నిర్ణ‌యం తీసుకోక త‌ప్ప‌లేద‌ని ఆస్ట్రేలియా న్యూస్ కార్ప్ చీఫ్ మైఖేల్ మిల్ల‌ర్ తెలిపారు.

Related posts