telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు

వారికి జియో మోత .. ఉండదట …

jio on charges to other networks

ఇతర నెట్‌వర్క్‌లకు చేసే కాల్స్‌కు నిమిషానికి 6 పైసలు చొప్పున వసూలు చేయనున్నట్టు రెండు రోజుల క్రితం ప్రకటించిన జియో ప్రజల వ్యతిరేకతతో కాస్త దిగివచ్చినట్టే ఉంది. ఈ ప్రకటన ప్రకారం తక్కువలో తక్కువ పది రూపాయలతో రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుందంటూ కొన్ని టాపప్ ఓచర్లను కూడా ప్రవేశపెట్టింది. ఇంటర్‌కనెక్ట్ యూసేజ్ చార్జ్ (ఐయూసీ)లో భాగంగా వీటిని వసూలు చేయక తప్పడం లేదని పేర్కొంది. ఖాతాదారులు కొనుగోలు చేసే ప్రతీ పది రూపాయల టాపప్‌పై అదనంగా ఒక జీబీ డేటా ఇవ్వనున్నట్టు జియో పేర్కొంది. దీంతో ఇతర నెట్‌వర్క్‌లకు తరచూ కాల్ చేసే ఖాతాదారులు టాపప్‌లు చేయించుకుంటున్నారు.

జియో తాజాగా ఖాతాదారులకు ఊరటనిచ్చే ప్రకటన చేసింది. అక్టోబరు 9వ తేదీకి ముందు రీచార్జ్ చేసుకునే ఖాతాదారులకు టాపప్ రీచార్జ్‌తో పనిలేదని ప్రకటించింది. వారంతా ఇతర నెట్‌‌వర్క్‌కు చేసే కాల్స్‌కు ఎటువంటి చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని, వారంతా ఉచితంగా కాల్స్ చేసుకోవచ్చని తెలిపింది. వారి ప్లాన్ గడువు తేదీ ముగిసే వరకు ఇది వర్తిస్తుందని, ఆ తర్వాత మాత్రం ఇతర నెట్‌వర్క్‌లకు చేసే కాల్స్‌కు నిమిషానికి 6 పైసలు చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది.

Related posts