telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు వ్యాపార వార్తలు సాంకేతిక

పిల్లలు తప్పిపోకుండా.. ఇంటెలిజెంట్ యూనిఫామ్ లు.. ఇవి చైనావే..

new tech to overcome child kidnaps

తరచుగా ఇటీవల పిల్లల అపహరణాలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో వాటిని నివారించాలనే ఆలోచన రావటం సహజం. మహా అయితే సాధారణంగా ఆలోచించేవారు ఇంకాస్త నిఘా పెంచాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి అనేంతవరకు ఆలోచిస్తారు. కానీ కాస్త బిన్నంగా ఆలోచించిన చైనా మరో కొత్త ఉత్పత్తిని కనిపెట్టి ప్రపంచం మీదకు వదలడానికి సిద్ధం అయ్యింది. దానిగురించి వివరాలలోకి వెళితే, చైనాలోని స్కూళ్లలో చిన్నారులు అదృశ్యమవుతున్న ఘటనలు పెరిగిపోతున్న నేపధ్యంలో వీటి నివారణకు కొత్త పరిష్కారాన్ని కనుగొన్నారు. దీనికితోడు చిన్నారులు తరచూ స్కూలుకు బంక్ కొడుతున్నారు. అందుకే అక్కడి 10 స్కూళ్లు చిన్నారులకు ‘ఇంటెలిజెంట్ యూనిఫారా’లను తయారుచేయించాయి. వీటి సాయంలో చిన్నారుల లొకేషన్‌ను ట్రాక్ చేయవచ్చు.

ఈ యూనిఫారాలను చైనాలోని గువాన్యూ టెక్నాలజీ కంపెనీ రూపొందించింది. ఈ యూనిఫారాలను గుయీఝోవూ, గువాంక్షీ ఝువాంగ్‌లలోని స్కూళ్లలో వినియోగిస్తున్నారు. ఈ యూనిఫారాల భుజాల వద్ద రెండు చిప్‌లను అమరుస్తారు. ఇవి చిన్నారుల లొకేషన్‌ను ట్రాక్ చేసేందుకు ఉపయోగపడతాయి. దీనికితోడు ఈ యూనిఫారం ధరించి స్కూలులోకి రాగానే వారు వచ్చిన సమయం నమోదవుతుంది. ఈ సమాచారం అటు పేరెంట్స్‌కు, ఇటు టీచర్స్‌కు మొబైల్ యాప్‌లో అందుతుంది. దీనితో పిల్లవాడు ఎక్కడ ఉన్నది అందరికి తెలిసిపోతుంది. తద్వారా అటు పాఠశాల సిబ్బంది, అటు తల్లిదండ్రులు పిల్లల గురించి స్థిమితంగా ఉండగలుగుతారు.

అవును ఇంతకీ పిల్లల గురించిన వస్తు ఉత్పత్తులు ఎక్కువగా వస్తున్నాయి ఇటీవల.. కదా. పిల్లలకి మంచి చేయాలనే ప్రతి తల్లితండ్రుల మనసును అర్ధం చేసుకున్న వ్యాపారాలు, దానిని వారికి అనుకూలంగా మార్చుకొని- పిల్లల రక్షణ, చదువు, తదితర విషయాలతో ముడిపెట్టి వారివారి వ్యాపారాలను సాగించుకుంటున్నారు. నిజమే ఎవరి ఆలోచనలు వారివి, కానీ పిల్లలపై కూడా వ్యాపారాలు చేయడం, సెంటిమెంట్ ను లాభాలుగా మార్చుకోవడం.. మానవత్వానికి ఆఖరి మెట్టు అయిపోయింది. అందుకే చూడకూడనివి, వినకూడనివి ఎక్కువ అవుతున్నాయి నేటి కాలంలో… తప్పదేమో, జీవితాలు గడవాలి కదా మరి.

Related posts