telugu navyamedia
ఆంధ్ర వార్తలు

మేకపాటి గౌతమ్ రెడ్డి సంతాపసభలో సీఎం జగన్‌..

*గౌతమ్‌ రెడ్డి సంస్మరణ సభలో సీఎం జగన్‌

*గౌత‌మ్‌రెడ్డిని నేనే రాజ‌కీయాల్లోకి తీసుకొచ్చా..

నెల్లూరు జిల్లాలో దివంగత మంత్రి గౌతమ్‌ రెడ్డి సంస్మరణ సభ నిర్వ‌హించారు. ఈ సంస్మరణ సభకు హాజరైన సీఎం జగన్.. గౌతమ్‌రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా దివంగత మంత్రి గౌతమ్‌ రెడ్డి కుటుంబ సభ్యులను సీఎం జగన్‌మెహన్‌ రెడ్డి ఓదార్చారు. అనంతరం గౌతమ్‌ రెడ్డి చిత్ర పటానికి పూల మాల వేసి సీఎం నివాళులు అర్పించారు.

AP CM YS Jagans Nellore Tour Details - Sakshi

ఈ కార్యక్రమంలో సీఎం జగన్ మాట్లాడుతూ.. గౌతమ్ రెడ్డి లేరన్న విషయాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని చెప్పారు. చిన్నప్పటి నుంచి గౌతమ్ రెడ్డి తనకు మంచి స్నేహితుడని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ఆయన మరణం తనకు వ్యక్తిగతంగా తీరని లోటని అన్నారు.

రాజకీయాల్లో ఇద్దరం మంచి స్నేహితులుగా ఉన్నామ‌ని అన్నారు. ప్రతీ అడుగులో నాకు తోడుగా ఉన్నాడు. గౌతమ్‌ రెడ్డితో ఉన్న సాన్నిహిత్యం చెప్పలేనిద‌ని గుర్తు చేసుకున్నారు. రాజకీయాల్లోని తనను నేను తీసుకువచ్చాను అని అన్నారు.గౌతమ్ రెడ్డి కుటుంబానికి తాను అండగా ఉంటానని జగన్ చెప్పారు.

cm Jagan participated in the condolence meeting of Goutham reddy in nellore

గౌతమ్ రెడ్డితో సాన్నిహిత్యం చెప్పలేనిదన్నారు. పరిశ్రమల శాఖ సహా 6 శాఖలను గౌతమ్ రెడ్డి నిర్వహించారని గుర్తుచేసుకున్నారు. చివరి క్షణం వరకు రాష్ట్రాభివృద్ది కోసం గౌతమ్ రెడ్డి శ్రమించారని తెలిపారు.మరణించే ముందు కూడా ఆయన దుబాయ్ కు వెళ్లి ఏపీలో పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేశారన్నారు.

మంచి మంత్రిగా, ఎమ్మెల్యేగా, స్నేహితుడిగా గౌతమ్ రెడ్డి నిలిచారని సీఎం జగన్ చెప్పారు. గౌతమ్ రెడ్డి కుటుంబానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. గౌతమ్ రెడ్డి గురించి ఎంత చెప్పినా ఆ లోటును భర్తీ చేయలేమని అన్నారు.

గౌతమ్ రెడ్డి పేరు చిరస్థాయిగా ఉండేలా కార్యక్రమం చేపడతామని తెలిపారు. మే 15 లోగా సంగం బ్యారేజ్ పనులు పూర్తి చేస్తామని ప్రకటించారు. సంగం బ్యారేజికి మేకపాటి గౌతమ్ సంగం బ్యారేజ్‌గా నామకరణం చేస్తున్నట్టుగా చెప్పారు.

 

Related posts