మిస్సెస్ ఇండియా తెలంగాణగా విజయవాడకు చెందిన భావన అరుదైన ఘనత సొంతం చేసుకున్నారు.వివాహితులకు నిర్వహించిన ఈ పోటీల్లో పాల్గొన్న 27 ఏళ్ల భావన విజయవాడకు చెందిన తొలి మహిళగా రికార్డు సృష్టించారు. ఈ పోటీల్లో దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి మొత్తం 111 మంది మహిళలు తుది ఎంపికలో పోటీపడ్డారు.
మిసెస్స్ ఇండియా ఎంపిక కోసం నిర్వహించిన ప్రాథమిక పోటీల్లో మిసెస్స్ ఇండియా తెలంగాణగా విజయవాడకు చెందిన కూచిపూడి నాట్యకారిణి భావన ఎంపికయ్యారు.వీరిలో భావన తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంపికై మిసెస్స్ ఇండియా పోటీలకు అర్హత సాధించారు. భావన కూచిపూడి నాట్యంలో పట్టభద్రురాలు. ఈమె గౌరవ డాక్టరేట్‌తోపాటు రాష్ట్ర, జాతీయ స్థాయి అవార్డులు మరో 22 సొంతం చేసుకున్నారు. బాహుబలి చిత్రానికి కొరియోగ్రఫీ చేశారు. పదేళ్లపాటు టీవీ రిపోర్టర్‌గా పనిచేశారు.
విద్యార్థులు వైసీపీ నేతల బూతులు వినాల్సి రావడం బాధాకరం…