telugu navyamedia
తెలంగాణ వార్తలు

యాదాద్రిలో వైభ‌వంగా మ‌హాకుంభ సంప్రోక్షణ పూర్తి..

*వైభవంగా ఆలయ ఉద్ఘాటన మహాక్రతువు..

*ముఖ్య‌మంత్రి కేసీఆర్ స‌మ‌క్షంలో యాగ జ‌లాలుతో సంప్రోక్ష‌ణ ప‌ర్వానికి శ్రీకారం
*కుటుంబ స‌మేతంగా పాల్గొన్న సీఎం కేసీఆర్‌
*మ‌హాకుంభ సంప్రోక్ష‌ణ కు హాజ‌రైన 15మంది మంత్రులు..
మండ‌లి చైర్మ‌న్‌, స్పీక‌ర్‌, ఎంపీలు, ఎమ్మేల్యేలు, ఎమ్మెల్సీలు..

యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ మహాకుంభ సంప్రోక్షణ పూర్తి అయ్యింది.  ఎంతో వైభవంగా మహాకుంభ సంప్రోక్షణ మహోత్సవం జరిగింది. 

శ్రీ సుదర్శన స్వర్ణచక్రానికి సీఎం సమక్షంలో యాగజలాలతో రుత్వికులు సంప్రోక్షణ చేశారు. ఆపై ప్రధానాలయం గోపురాలపై కలశాలకు కుంభాభిషేకం, సంప్రోక్షణ చేశారు.

విమాన గోపురంపై శ్రీ సుదర్శన స్వర్ణచక్రానికి సీఎం సమక్షంలో యాగజలాలతో రుత్వికులు సంప్రోక్షణ తో పాటు.. ఆరు రాజగోపురాలపై స్వర్ణ కలశాలకు సంప్రోక్షణ జరిగింది. వేద పండితులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సీఎం కేసీఆర్‌ ప్రధాన రాజగోపురం దగ్గర, మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులు మిగతా గోపురాల దగ్గర.. ఉప ఆలయాలు, ప్రకార మండపాల దగ్గర సంప్రోక్షణ చేశారు.

సంప్రోక్షణ తర్వాత నేరుకు గర్భాలయంలోకి వెళ్లారు. స్వయంభూ విగ్రహం దగ్గర సీఎం తొలి పూజ చేశారు. సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో భక్తులకు స్వామి దర్శనానికి అనుమతిస్తారు. 

Related posts