telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

బయటకి తెచ్చారు.. పారిపోతున్నారంటూ.. కాల్చేశారు.. దిశ కు ఎన్కౌంటర్ న్యాయం..

disa accused encountered on escaping

దిశ హత్య కేసులో నిందితులను తక్షణమే ఎన్ కౌంటర్ చేసి పారేయాలని ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. దీని గురించి పార్లమెంట్ లో కూడా పెద్ద ఎత్తున డిబేట్ జరిగింది. అయితే సీన్ రికన్స్ట్రక్షన్ చేసే సమయంలో నిందితులను దిశ చనిపోయిన స్పాట్ కు తీసుకొచ్చారు. అయితే నిందితులు తప్పించుకోబోతుండగా పోలీసులు వారిని కాల్చి చంపేశారు. దీనితో సరిగ్గా దిశ ఎక్కడ అయితే చనిపోయిందో వారు కూడా అక్కడే చనిపోవటం విశేషం. దీనితో ప్రజా సంఘాలు .. ప్రజలు పెద్ద ఎత్తున ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా దిశ ఘటన సంచలనం రేపిన సంగతీ తెల్సిందే. ఈ ఘటన పై దేశ ప్రజలు భగ్గుమన్నారు. దిశ దారుణ హ్యతకు నిరసనగా ప్రజలంతా రోడ్లపైకి ఎక్కారు. ఈ ఘటనకు కారణమైన నిందితులను బహిరంగంగా ఉరితీయాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థి లోకం, మహిళా సంఘాలు, సామాజిక కార్యకర్తలు ఇలా సమాజం మొత్తం ఒక్కతాటిపైకి వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తూ దోషులను వెంటనే శిక్షించాలని కొట్టుకున్నారు. ఇప్పుడు సరిగ్గా అటువంటిదే జరిగింది.

నిర్భయ కేసు తరువాత దేశం మొత్తం ఆగ్రహాన్ని తెప్పించిన ఘటనగా దిశ ను చెప్పవచ్చు. హైదరాబాద్ నగర శివారులో జరిగిన ఈ ఘటన.. దేశం మొత్తం ఉలిక్కి పడేలా చేసింది. ఈ ఘటనను బాలీవుడ్ప్రముఖులు సైతం ఖండించారు. సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ ఈ ఘటనను ఖండిస్తూ.. వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. మనిషి రూపంలో ఉన్న ఈ రాక్షసులే అత్యంత హేయనీయం. అమాయకులైన నిర్భయ, ప్రియాంక రెడ్డి.. వారు పడిన బాధ, వారి మరణం లాంటి ఘటనలతోనైనా సమాజం ఒక్కతాటిపైకి వచ్చి.. మరో అమాయకురాలు బలికాక ముందే అలాంటి రాక్షసులను అంతం చేయాలంటూ ఎంతో ఉద్వేగ పూరితంగా సల్మాన్ ట్వీట్ చేశాడు.

Related posts