telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

ఇచ్చిన హామీ మేరకు భూమిని తిరిగి ఇచ్చేయాలని జగన్ నిర్ణయం…

Ycp Kannababu

నిన్న ఏపీ క్యాబినెట్ సమావేశం జరిగిన విషయం తెలిసిందే. అందులో సీఎం జగన్ చాలా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. కానీ కాకినాడ ఎస్ఈజడ్ కోసం సేకరించిన భూమి లో 2,180 ఎకరాలను ఆ రైతులకే తిరిగి అప్పగించాలన్నది చారిత్రాత్మక నిర్ణయం అని ఎస్ఈజడ్ కమిటీ ఛైర్మన్ కన్నబాబు పేర్కొన్నారు. కమిటీ చేసిన 10 సిఫార్సులను క్యాబినెట్ ఆమోదించిందన్న ఆయన ఈ భూములకు సంబంధించి సంవత్సరాలుగా ఆందోళన కొనసాగుతోందని అన్నారు. 2012లోనే ఈ భూముల్లో ఏరువాక చేస్తానని హడావుడి చేసిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత అంగుళం భూమి కూడా వెనక్కి ఇవ్వలేదని మంత్రి పేర్కొన్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు భూమిని తిరిగి ఇచ్చేయాలని జగన్ నిర్ణయించారని అన్నారు. ఖాళీ చేయాలన్న ఆరు గ్రామాలు శ్రీరాంపురం‌,  ముమ్మడివరిపోడు, బండిపేట, పాటివారిపాలెం, రావివారిపాడు, రామరాఘవపురం లను ఇప్పుడు మినహాస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుందని ఆయన అన్నారు. ఆ ఆరు గ్రామాల భూములను  నిషేధిత జాబితా నుంచి తొలగించామని పరిహారం పెండింగ్ లో ఉన్న 657 ఎకరాల అసైన్డ్ భూమికి సంబంధించి ఎకరానికి 5 లక్షల పరిహారం అదనంగా ఇవ్వాలని కమిటీ సిఫార్సు చేసిందని అన్నారు. చూడాలి మరి ఇంకా ఏం జరుగుతుంది అనేది.

Related posts