telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

2019 ప్రపంచ కప్ : .. ఆస్ట్రేలియా భారీ స్కోర్ .. మరోపక్క వరుణుడు..

rain may cancell india vs pak match today

నేడు ప్రపంచ కప్ లో భాగంగా ఆస్ట్రేలియా-బాంగ్లాదేశ్ తలపడుతున్నాయి. ఆస్ట్రేలియా దూకుడుగానే ఆట ప్రారంభించింది. డేవిడ్ వార్నర్ ఈ మ్యాచ్‌లో సరికొత్త రికార్డు క్రియేట్ చేసి ఔటయ్యాడు. ఈ టోర్నీలో అత్యధిక వ్య‌క్తిగ‌త‌ స్కోర్ 166 చేసి పెవిలియన్ చేరాడు. డబుల్ సెంచరీ దిశగా దూసుకెళ్లిన వార్నర్.. సౌమ్య సర్కార్ బౌలింగ్‌లో రుబెల్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 147 బంతుల్లో వార్నర్ 166 పరుగులు చేశాడు. వార్నర్ ఔట్ అవడంతో మాక్స్‌వెల్ క్రీజులోకి వచ్చాడు.

ఆఖరి ఓవర్ .. కానీ వరుణుడు వెంటనే స్టేడియంలో ప్రత్యక్షమయ్యాడు. దీనితో 49 ఓవర్లకే మ్యాచ్ ఆగిపోయింది. ఆస్ట్రేలియా ఆటగాళ్లు మాత్రం రెచ్చిపోయారు. 49 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 368 పరుగులు చేశారు. ప్రస్తుతం క్రీజులో స్టోయినిస్, కారే ఉన్నారు. స్టోయినిస్ 7 బంతుల్లో 6 పరుగులు చేయగా.. కారే 6 బంతుల్లో 9 పరుగులు చేశాడు.

Related posts