telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్

నలుగురు బీఎస్ఎఫ్ జవాన్లు మృతి .. ఛత్తీస్ గఢ్ మావోయిస్టుల ఘాతుకం…

4 bsf jawan killed by maoists in chhattisgarh

ఛత్తీస్ గఢ్ లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. భద్రతాబలగాలే లక్ష్యంగా మెరుపుదాడికి తెగబడ్డారు. ఈ దుర్ఘటనలో నలుగురు బీఎస్ఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు గాయపడ్డారు. క్షతగాత్రులను సహచరులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఛత్తీస్ గఢ్ లోని కాంకేర్ జిల్లా మహ్లీ గ్రామానికి సమీపంలోని అటవీప్రాంతంలో మావోలు ఉన్నట్లు బలగాలకు సమాచారం అందింది.దీనితో 114వ బెటాలియన్ కు చెందిన బీఎస్ఎఫ్ జవాన్లు కూంబింగ్ ఆపరేషన్ మొదలుపెట్టారు.

జవాన్ల కదలికలను గుర్తించిన మావోలు విచక్షణారహితంగా కాల్పులు ప్రారంభించారు. దీనితో అప్రమత్తమైన జవాన్లు ఎదురుకాల్పులు ప్రారంభించారు. ఈ ఘటనలో నలుగురు బీఎస్ఎఫ్ జవాన్లు అమరులు కాగా, ఇద్దరు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించిన అధికారులు వెంటనే కూంబింగ్ ను ముమ్మరం చేశారు. కాంకేర్ లోక్ సభ నియోజకవర్గంలో ఈ నెల 18న ఎన్నికలు జరగనున్నాయి.

Related posts