telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

దుబ్బాక ఎన్నికపై ఉన్న శ్రద్ద, రాష్ట్ర ప్రజలపైన లేదు

సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతారావు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల మీద ఉన్న శ్రద్ధ అకాల వర్షంతో నష్టపోయిన రైతుల పైన లేదని.. రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం సర్వేకు వస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం కదలడం లేదని ఫైర్ అయ్యారు. హైదరాబాద్ లో ఇల్లు కులిన వాళ్లకు 10వేలు ఇవ్వడం సరిపొవని.. మొత్తం కూలిన ఇళ్లకు 2లక్షలు, పాక్షికంగా కూలిన ఇళ్లకు లక్ష ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎప్పుడు ఎక్కడ నష్టం జరిగిన అది కాంగ్రెస్ పాపమే అంటున్నారని..ఆరు ఏండ్ల నుండి మీరు ఏమి చేస్తున్నారని ఫైర్ అయ్యారు. దుబ్బాక ఎన్నికలో చూపిన శ్రద్ద , రైతులు, ప్రజల పైనా రాష్ట్ర ప్రభుత్వానికి లేదని మండిపడ్డారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 20వేలు ఇవ్వాలని..LRS విషయంలో ప్రభుత్వం దోపిడీ చేస్తుందన్నారు. వర్షాలకు నష్టం ఎక్కడ జరిగిందో అక్కడికి అధికారులు వెంటనే వెళ్లి సర్వే చేసి..వారికి న్యాయం చేయాలనీ డిమాండ్ చేశారు. పంట నష్టంతో రైతులు ఆందోళనలో ఉన్నారని..ఆత్మహత్య చేసుకొనే పరిస్థితి ఉందన్నారు. ప్రభుత్వం వెంటనే మేలుకొని ఎకరాకు 20వేలు ఇచ్చి రైతులను ఆదుకోవాలని.. రైతులకోసం 31 నాడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కార్యక్రమం చెపడుతున్నామని తెలిపారు.

Related posts