చెన్నై వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ ఆల్ ఔట్ అయ్యింది. తొలిరోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసిన భారత్ ఈరోజు మరో 29 పరుగులు చేసి ఆ నాలుగు వికెట్లు కోల్పోయింది. అయితే ఈరోజు ఆట ప్రారంభమైన మొదటి ఓవర్లోనే అక్షర్(5) ఇషాంత్(0) పెవిలియన్ కు చేరుకున్నారు. ఆ తర్వాత కుల్దీప్ మరోవైపు నిలబడగా పంత్ హిట్టింగ్ ప్రారంభించాడు. ఈ క్రమంలోనే తన హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. కానీ ఆ తర్వాత 95 ఓవర్లో కుల్దీప్ ఔట్ అవ్వగా తర్వాత బ్యాటింగ్ కు వచ్చి ఒక ఫోర్ బాది వెనుదిరిగాడు సిరాజ్. దాంతో నాట్ ఔట్ గా నిలిచాడు పంత్(58). అయితే తొలి సెషన్‌లో ఓపెనర్ శుభ్‌మన్ గిల్తో పాటు కెప్టెన్ విరాట్ కోహ్లీ పుజారా త్వరగా అవుట్ కావడంతో టీమిండియా 106 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయింది. ఇలాంటి తరుణంలో ఓపెనర్ రోహిత్ శర్మ, రహానే భారీ ఇన్నింగ్స్‌తో అద్భుతంగా రాణించారు. చూడాలి మరి మన బౌలర్లు ఏం చేస్తారు అనేది.
previous post
next post
సచివాలయం కూల్చివేత కోర్టు ధిక్కరణే: ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి