telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

నాలుగు రోజులుగా పోలీసులకు చుక్కలు చూపెడుతున్న బాలుడి కిడ్నాప్ గ్యాంగ్…

మహబూబాబాద్ లో దీక్షిత్ అనే బాలుడి కిడ్నాప్ పై ఉత్కంఠ కొనసాగుతుంది. ఇపపటికీ 15 సార్లు ఇంటర్నెట్ కాల్ చేసారు కిడ్నాపర్. ఇవాళ ఒక్కరోజే ఐదుసార్లు ఫోన్ చేసి 30 లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకుని కిడ్నాపర్ చెప్పిన అడ్రస్ లో ఎదురుచూస్తున్నాడు బాలుడి తండ్రి రంజిత్ రెడ్డి. నాలుగు గంటల తర్వాత మరోచోటుకి రమ్మన్న కిడ్నాపర్ అందుకే ఇప్పుడు అక్కడ ఎదురుచూస్తున్నాడు రంజిత్ రెడ్డి. ఎప్పుడు ఎం జరుగుతుందోనని తెలియని ఉత్కంఠ… నాలుగు రోజులుగా పోలీసులకు చుక్కలు చూపెడుతున్న బాలుడి కిడ్నాప్ గ్యాంగ్ కేసు. ఐటీకోర్, సైబర్ క్రైమ్ ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగినా పురోగతి లేదు. బాలుడి తల్లిఫోన్ కు కొనసాగుతున్న కిడ్నాపర్ ల ఫోన్ల పరంపర… డబ్బు మూటతో కిడ్నాపర్లు చెప్పినచోటే రాత్రంతా పడిగాపులు కాసాడు బాలుడి తండ్రి. ఇంటర్ నెట్ కాల్ కావడంతో ట్రేసౌట్ చేయలేకపోతున్నారు పోలీసులు. ఎన్ఐఏ ను రంగంలోకి దించే అవకాశం ఉంది. కిడ్నాప్ పై డీజీపీ మహేందర్ రెడ్డి తో కేటీఆర్ మాట్లాడారు. పదిమంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు.

Related posts