telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

న్యూడ్ సీన్స్ పై శృంగార తార హాట్ కామెంట్స్

Mallika-Sherawath

బాలీవుడ్ లో శృంగార తారగా వెలుగొందిన నటి మల్లికా శరావత్. తన అందాల ఆరబోతతో ఎందరో కుర్రాళ్లకు మతులు పోగొట్టి, సినిమాలకు కాసుల వర్షం కురిపించిన మల్లికా శరావత్ కు ఇటీవల సినిమా అవకాశాలు బాగా తగ్గిపోయాయి. ప్రస్తుతం మల్లికా నటిస్తున్న చిత్రం “బూ..సబ్కి ఫేటేగి”. మల్లికా శరావత్ నటించిన “మర్డర్” చిత్రం అప్పట్లో బాలీవుడ్ లో ఓ సంచలనం. ఆ చిత్రంలో నగ్న సన్నివేశాలు, రొమాంటిక్ సీన్స్ లో మల్లిక రెచ్చిపోయింది. ఆమె కోసమే ప్రేక్షకులు ఆ సినిమాకు క్యూ కట్టారంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం మల్లికా శరావత్ మునుపటిలా వరుసగా సినిమాలు చేయడం లేదు. తాజాగా మల్లికా శరావత్ ఓ ఇంటర్వ్యూలో ప్రజెంట్ జనరేషన్ హీరోయిన్లపై హాట్ కామెంట్స్ చేసింది. “ఒకప్పుడు న్యూడ్ సీన్స్ లో, ముద్దు సన్నివేశాల్లో నటించడం సంచలనం. నేను కొన్ని చిత్రాల్లో అలా నటించా. ఆ సమయంలో నాపై అనేక విమర్శలు ఎదురయ్యాయి. కానీ ప్రస్తుతం ఉన్న హీరోయిన్లు ఎలాంటి బెదురులేకుండా రొమాంటిక్ సన్నివేశాల్లో నటిస్తున్నారు. ఇప్పుడు ముద్దు సన్నివేశాలు, న్యూడ్ సీన్స్ చాలా కామన్ అయిపోయాయి. అంతేకాదు సీన్ డిమాండ్ చేస్తే.. నగ్నంగా నటించడానికి కూడా వెనకాడటం లేదు. ఇపుడు అలా నటించే వారిపై విమర్శలు కూడా తగ్గిపోయాయి. జనాలు కూడా అలా నటించే వారిని బాగానే రిసీవ్ చేసుకుంటున్నారు. నటించేవాళ్లకు.. చూసేవాళ్లకు ఇబ్బంది లేనప్పుడు ఇక వివాదం ఏముంది ?” అంటూ వ్యాఖ్యానించింది ఈ హాట్ బ్యూటీ.

Related posts