అమెరికాలో తెలుగు విద్యార్థుల అరెస్ట్ పై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. బుధవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ చదువుకోడానికి వెళ్లిన విద్యార్థులను అరెస్టు చేయడం దారుణమని అన్నారు. విద్యార్థులు అమెరికాకు చదువుకోడానికి వెళ్లారని, తప్పుడు పనులు చేయడానికి కాదని చంద్రబాబు నాయుడు చెప్పారు. విద్యార్థుల అరెస్ట్ పై గట్టిగా పోరాడుతామని ఆయన అన్నారు.
అమెరికాలో ఇబ్బందులు పడుతున్న తెలుగు విద్యార్థులను సురక్షితంగా తిరిగి తీసుకువచ్చే బాధ్యత టీడీపీ ప్రభుత్వం తీసుకుంటుందని అన్నారు. విద్యార్థులు బ్రోకర్ల ఉచ్చులో పడకుండా జాగ్రత్తగా ఉండాలని సీఎం సూచించారు. విదేశీ విద్య కోసం రూ. 15 లక్షలు ఇస్తున్నామని చంద్రబాబు తెలిపారు.