తమ డిమాండ్లను పరిష్కరించాలని ఉత్తరప్రదేశ్ లో 40 లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఈ రోజు సమ్మె బాట పట్టారు. దీంతో పాలన పరంగా తీవ్ర ఇబ్బందికర పరిస్థితి నెలకొంది వివిధ శాఖల ఉన్న్తాధికారులతో పాటు ఉద్యోగులు, ఉపాధ్యాయులు సమ్మెలో పాల్గొంటున్నారు. ప్రస్తుత పెన్షన్ స్కీమ్ ను రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వీరంతా ఏడు రోజుల సమ్మెకు దిగారు.
మరోవైపు, సమ్మెకు దిగిన ఉద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వం కన్నెర్ర జేసింది. ఎస్మా చట్టాన్ని ప్రయోగించింది. ఆరు నెలల పాటు అన్ని విభాగాలు, కార్పొరేషన్లలోని ఉద్యోగులు ఎలాంటి సమ్మెలు చేపట్టరాదంటూ ఎస్మా నోటిఫికేషన్ ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనూప్ చంద్ర పాండే జారీ చేశారు. ఎస్మా అమల్లో ఉంటే సమ్మెకు దిగిన ఉద్యోగుల పై ఎలాంటి వారెంటు లేకుండా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది.
తిరుమల తిరుపతి ఆంధ్రుల ఆస్తి: చంద్రబాబు