తెలంగాణ నాగోబా జాతర సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాకు రేపు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ ఉత్తర్వులు జారీ చేశారు. రేపు సెలవు ప్రకటనతో మార్చి 9న పనిదినంగా పరిగణించాలని కలెక్టర్ ఆదేశించారు. మెస్రం వంశీయులు సోమవారం రాత్రి నిర్వహించిన మహాపూజలతో ప్రారంభమైన నాగోబా జాతర మంగళవారం భక్తజనంతో కిక్కిరిసిపోయింది.
ఆలయ సమీపంలోని గోవాడ్‌లో మెస్రం వంశీయుల మహిళల ఆధ్వర్యంలో నైవేద్యాలు తయారు చేసి దీపాలు వెలిగించి సంప్రదాయ పూజలు చేశారు. నాగోబాను మంగళవారం ప్రముఖులు దర్శించుకున్నారు. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ క్రిస్టినా జడ్ చోంగ్తూతోపాటు నిర్మల్ కలెక్టర్ ప్రశాంతి సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు.