telugu navyamedia
రాజకీయ

మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం..శిందే వెంట 40 మంది ఎమ్మెల్యేలు.. అసోంకు పయనం..

*చీలిక దిశ‌గా శివ‌సేన‌..ప్ర‌భుత్వం కూలిపోయే ప్ర‌భుత్వం
*గౌహ‌తీ చేరుకున్న శివ‌సేన నేత ఏక్‌నాథ్ షిండే

*త‌న‌తో 40 మంది ఎమ్మెల్యేలు ఉన్న‌ట్లు వెల్ల‌డి

మహారాష్ట్రలో ముదిరిన రాజకీయ సంక్షోభం. శివసేన చీఫ్, సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేపై కొంతకాలంగా అసంతృప్తితో ఉన్న పార్టీ కీలక నేత, రాష్ట్ర పట్టణాభివృద్ధి మంత్రి ఏక్‌నాథ్‌ షిండే (58) తిరుగుబావుటా ఎగురవేసిన విష‌యం తెలిసిందే.

ఈ క్ర‌మంలో మంగళవారం గుజరాత్​లో ఓ హోటల్​లో ఉన్న ఈ బృందం.. ఇప్పుడు అసోంకు చేరుకున్నారు. గుహవటిలో విమానాశ్రయంలో ఏక్‌నాథ్‌ షిండే మీడియాతో మాట్లాడుతూ.. తనతో శివసేనకు చెందిన 40 మంది(33 మంది శివసేన ఎమ్మెల్యే, 7 స్వతంత్రులు) ఎమ్మెల్యేలు ఉన్నట్లు తెలిపారు

‘మేం బాలాసాహెబ్ థాకరే యొక్క శివసేనను విడిచిపెట్టలేదు…మేం బాలాసాహెబ్ యొక్క హిందుత్వను అనుసరిస్తున్నాం, దానిని మరింత ముందుకు తీసుకువెళతాం’’ అని ఏక్‌నాథ్ షిండే సూరత్ అన్నారు.

మ‌హారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే బీజేపీతో పొత్తు పెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నా కోరిక‌. మిగిలిన ఎమ్మెల్యేలు కూడా అదే కోరుకుంటున్నారని వెల్ల‌డించారు

ఈ పరిస్థితుల్లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే పంపిన శివసేన నాయకులు మిలింద్ నార్వేకర్, రవీంద్ర ఫాటక్ తిరుగుబాటుదారులతో హోటల్‌లో చర్చలు జ‌రిపారు .

Maharashtra Political Crisis Live Updates, Cabinet Meeting Latest News: Maharashtra Political Crisis: Eknath Shinde in Guwahati, Claims 46 MLAs With Him

ఏక్‌నాథ్‌ శిందేతో ఫోన్‌లో మాట్లాడినా సానుకూలత రాలేదు. మళ్లీ బీజేపీతో శివసేన జత కట్టాలని ఉద్దవ్‌కు శిందే సూచించినట్లు తెలుస్తోంది. ఇందుకు ఆయన విముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం.. 

ఆ త‌రువాత  వారంతా అస్సాం బ‌య‌లుదేరి వెళ్లారు ఈ సందర్భంగా వారిని రిసీవ్‌ చేసుకునేందుకు వచ్చిన అసోం బీజేపీ ఎమ్మెల్యే సుశాంత బోర్గోవైన్‌ విమానాశ్రయానికి వచ్చారు. 

మ‌హారాష్ట్ర శాసనసభలో తగినంత సంఖ్యాబలం లేకపోయినా అధికార కూటమి నుండి క్రాస్ ఓటింగ్, మద్దతు వ‌ల్ల బీజేపీ ఐదో ఎమ్మెల్సీ సీటు ను గెలుచుకుంది. దీంతో మ‌హారాష్ట్రలో రాజ‌కీయ సంక్షోభం ఒక్క‌సారిగా బ‌య‌ట‌ప‌డింది. ఈ ప‌రిణామం త‌రువాత వెంటనే ఏక్ నాథ్ షిండే, ప‌లువురు ఎమ్మెల్యేల‌ను తీసుకొని సోమ‌వారం అర్థరాత్రి స‌మ‌యంలో సూరత్ హోటల్‌కు చేరుకున్నారు. ఈ ఎమ్మెల్యేల‌లో కొంద‌రు స్వ‌తంత్రులు ఉండ‌గా.. మ‌రి కొంద‌రు చిన్న పార్టీల‌కు చెందిన వారు కూడా ఉన్నారు. 

ఇదిలా ఉండగా.. నేడు(బుధవారం) మహారాష్ట్ర కేబినెట్‌ సమావేశం కానుంది. మధ్యాహ్నం ఒంటిగంటకు కేబినెట్‌ సమావేశం జరుగనుంది. భవిష్యత్‌ కార్యాచరణపై కీలక జరిగే అవకాశం ఉంది.

Related posts