telugu navyamedia
రాజకీయ

మ‌హా సంక్షోభం : నా వల్ల ఏమైనా తప్పు జరిగితే క్ష‌మించండి అంటూ వెళ్లిపోయిన మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే..

*నా వాళ్ళే న‌న్ను మోసం చేశారు..
*కేబినేట్ భేటిలో మంత్రుల‌కు ధ‌న్య‌వాదాలు తెలిపిన ఉద్ధ‌వ్‌
*రెండున్న‌రేళ్ళు స‌హ‌క‌రించిన అంద‌రికీ ధ‌న్య‌వాదాలు.
*నా వ‌ల్ల ఏదైనా త‌ప్పు జ‌రిగిఉంటే క్ష‌మించండి..
*రేపు మ‌హారాష్ర్ట అసెంబ్లీ స‌మావేశం

మ‌హారాష్ర్ట సీఎం ఉద్ధ‌వ్ థాక్రే రాజీనామాకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు తెలుస్తోంది. రేపు విశ్వాస పరీక్షకు గవర్నర్ ఆదేశించిన నేపథ్యంలో ఉద్దవ్‌ ఠాక్రే అధ్యక్షతన జ‌రిగిన మహారాష్ట్ర కేబినెట్ భేటీలో ఉద్వేగ సన్నివేశాలు చోటు చేసుకున్నాయి.

మహారాష్ట్ర కేబినెట్‌ సమావేశం అనంతరం ఉద్ధవ్ ఠాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు..తన వల్ల ఏదైనా తప్పు జరిగితే క్షమించండని ఉద్ధవ్ ఠాక్రే మంత్రులతో అన్నారు. ఈ రెండున్నరేళ్లుగా తనకు అండగా నిలబడిన, సహకరించిన వాళ్లందరికి కృతజ్ఞతలు తెలిపారు. 

తన వాళ్లే తనను మోసం చేశార ని చేశారని, ఈ పరిస్థితికి తీసుకొచ్చారని ఉద్వేగానికి లోనయ్యారు. భేటీ అనంతరం సచివాలయం నుంచి బయటకు వచ్చిన ఉద్ధవ్ థాక్రే మీడియాకు నమస్కరించి వెళ్లిపోయారు. 

అలాగే ఇవాళ్టీ భేటీ మంత్రిమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలోని రెండు నగరాల పేర్లును మార్చింది. ఔరంగాబాద్ ను శంభాజీనగర్ గా, ఉస్మానాబాద్ ను ధార్‌శివ్ గా మార్చింది. అలాగే నవీ ముంబై ఎయిర్ పోర్టుకు డీబీ పాటిల్ విమానాశ్రయంగా మార్చుతూ ఉద్ధవ్ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

ముఖ్యంగా.. ముఖ్యమంత్రి ఉద్ధవ్​ ఠాక్రే చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. సుప్రీంకోర్టులో తీర్పు ఉద్ధ‌వ్ కు వ్యతిరేకంగా వస్తే సీఎం పదవికి రాజీనామా చేస్తారా?కేబినెట్ భేటీలో అందరికీ ధన్యవాదాలు ఎందుకు చెప్పారు? రెండున్నరేళ్లు సహకరించినందుకు థ్యాంక్స్ అని ఎందుకన్నారు? రాష్ట్ర ప్రజలకు థ్యాంక్స్‌ చెప్పడం వెనుక ఆయన ఉద్దేశం ఏంటి? ఫినిషింగ్ టచ్‌గా పట్టణాల పేర్లు మార్చారా? తాను హిందుత్వ వాదినని నిరూపించుకునే ప్రయత్నం చేశారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఇదిలా ఉండగా.. ఏక్‌నాథ్ షిండే క్యాంపులోని ఎమ్మెల్యేలంతా గౌహతి నుంచి గోవాకు మకాం మార్చారు. బలపరీక్ష నిరూపించుకోవాల్సిన పరిస్థితే వస్తే ఉద్ధవ్ సర్కార్ కూలిపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Related posts