telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

బంగారు తెలంగాణగా కాదు.. మద్యం తెలంగాణ: డీకే అరుణ

dk-aruna

మద్యం నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి, బీజేపీ నేత డీకే అరుణ డిమాండ్ చేశారు. శనివారం నల్గొండ లో బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో మహిళా సాధికారతపై సదస్సు జరిగింది. ఈ సదస్సుకు డీకే అరుణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమే మాట్లాడుతూ తెలంగాణలో జరుగుతున్న నేరాలకు విచ్చలవిడిగా జరుగుతున్న మద్యం అమ్మకాలే ప్రధాన కారణమని అన్నారు.

రాష్ట్రంలో దిశ, సమత ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బంగారు తెలంగాణగా కాదు.. మద్యం తెలంగాణగా రాష్ట్రం మారిందన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో మద్య నిషేధంపై అన్ని వర్గాల ప్రజలను చైతన్యపరుస్తామని ఆమె పేర్కొన్నారు.

Related posts