telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

బస్తీదవాఖానాల ద్వారా ప్రతి రోజూ 14వేల మందికి వైద్యసేవలు: తలసాని

talasani srinivas yadav

బస్తీదవాఖానాల ద్వారా ప్రతి రోజూ సుమారు 14వేల మంది వైద్యసేవలు పొందుతున్నారని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. జంటనగరాల్లో కొత్తగా మరో 25 బస్తీదవాఖానాలను శుక్రవారం ప్రారంభించనున్నట్టు పశుసంవర్ధకశాఖ మంత్రి తెలిపారు. ప్రభుత్వం వైద్య రంగాన్ని బలోపేతం చేస్తుందని తెలిపారు. మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ ఆలోచనలలో నుంచి ఏర్పాటు అయినవే బస్తీదవాఖానాలని మంత్రి తలసాని తెఇలపారు.

వీటి పనితీరు పట్ల ఎంతో శ్రద్ధతో ఉన్నారని పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసి పరిధికి సంబంధించి హైదరాబాద్‌ జిల్లాకు 95, రంగారెడ్డి జిల్లాపరిధిలో 32, మేడ్చల్‌ పరిధిలో 40, సంగారెడ్డిలో 3 చొప్పున ఇప్పటికే 170 బస్తీదవాఖానాలను ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చినట్టు చెప్పారు నూతనంగా 25 దవాఖానాల ప్రారంభంతో అదనంగా మరో 2వేల మందికి వైద్యసేవలు అందుతాయని ఆయన చెప్పారు.

Related posts