తమ సమస్యలు చెప్పుకోడానికి వచ్చిన ఎఎన్ఎమ్‌లను సీఎం జగన్ పట్టించుకోలేదని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ట్విట్టర్‌లో విమర్శించారు. పెంచిన వేతనాలను వెంటనే చెల్లించాలని ఇటీవల ఏఎన్ఎంలు విజయవాడలో ధర్నాకు దిగిన సమయంలో తీసిన వీడియోను చంద్రబాబు తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేయడంతో అదిప్పుడు వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో జగన్ పై తీవ్ర విమర్శలు గుప్పించిన ఓ ఏఎన్ఎం, తన భర్తతో పాటు ఎంతో మంది మొగుళ్లను జైళ్లలో పెట్టారని ఆవేదన వ్యక్తం చేసింది.
ధర్నాను విరమించి తాము వెనక్కు వెళితేనే వారిని వదిలేస్తామని అంటున్నారని మండిపడింది. వేల కిలోమీటర్లు పాదయాత్ర తిరిగిన జగన్, పక్కనే ఉన్న విజయవాడకు వచ్చి తమతో ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించింది. ఇక ఈ వీడియోను పోస్ట్ చేసిన చంద్రబాబు వైసీపీ ప్రభుత్వ దుర్మార్గానికిది పరాకాష్ట అని. గత్యంతరంలేక ఆందోళనకు దిగిన మహిళలను బెదిరించడానికి వారి భర్తలను తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెడతారా? అంటూ ఆయన ట్విట్టర్ ద్వారా ఆగ్రహం వ్యక్తం చేశారు.
మూడు రాజధానుల కేసును విచారించిన హైకోర్టు…