telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

బీజేపీకి సీట్లు తక్కువ వస్తే.. ప్రధాని మార్పు : సంజయ్ రౌత్

sanjay rout on alliance with bjp

విడిపోయిన మిత్రులు మళ్ళీ కలిశారు.. గతంలో కలిసి పోటీచేసి అనంతరం విధివిధానాలు నచ్చలేదని విడిపోయిన శివసేన మళ్ళీ బీజేపీతో జతకట్టింది. అయితే తాము బీజేపీతో రాజీపడలేదని, ఏ విషయంలో అయినా ఎన్డీయే నిర్ణయం ప్రకారం నడుస్తామని శివసేన పార్టీ నేత సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. బీజేపీ తో పొత్తుపై సంజయ్‌ రౌత్‌ మాట్లాడుతూ రాష్ట్ర, దేశ రాజకీయాల్లో తమ విధానాలను వివరించారు. ‘రాష్ట్రంలో మేము ఇప్పటికీ పెద్దన్న పాత్రనే పోషిస్తున్నాము. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా 122 సీట్లు గెలుచుకుంది. మా పార్టీ 63 సాధించింది. మా కన్నా అధిక సంఖ్యలో సీట్లు గెలుచుకున్నప్పటికీ ఈ సారి చెరిసగం సీట్లలో పోటీ చేయడానికి భాజపా అంగీకరించింది. అంతేకాదు, శివసేన నేతను ముఖ్యమంత్రి చేయడానికి కూడా భాజపా సానుకూలంగా ఉంది.

రాష్ట్రంలో శివసేన స్థానంలో ప్రత్యామ్నాయంగా భాజపా ఉండే అవకాశం లేదు. ఇప్పుడు ఉన్న భాజపా నిజమైన భాజపా కాదు. భాజపాలో ప్రస్తుతం సగం మంది కాంగ్రెస్‌, నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి వచ్చిన అవినీతి పరులు ఉన్నారు. మేము మహారాష్ట్రలోనే కాకుండా ఉత్తర్‌ప్రదేశ్‌, బిహార్‌, జమ్ముకశ్మీర్‌ వంటి పలు రాష్ట్రాల్లోనూ పోటీ చేసే అవకాశం ఉంది. ఆ రాష్ట్రాల్లో మా పార్టీ కార్యకర్తలు ఉన్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో గెలుచుకున్న సీట్ల కన్నా ఈ సారి భాజపా 100 సీట్లు తక్కువగా గెలుచుకుంటే, తదుపరి ప్రధాని ఎవరన్న విషయాన్ని ఎన్డీఏ నిర్ణయిస్తుంది’ అని సంయజ్‌ రౌత్‌ వ్యాఖ్యానించారు.

Related posts