రాయలసీమలో ఇసుక మాఫియా రెచ్చిపోతుంది. నిబంధనలకు విరుధ్ధంగా ఇసుకను తరలిస్తూ అడ్డుకున్నవారిని అంతమొందించెందుకు కుట్రలు చేస్తున్నారు. కడప జిల్లా సిద్దవటం మండలం దగ్గర పెన్నానది నుంచి అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్‌ను రెవెన్యూ సిబ్బంది అడ్డుకుంది.
అయితే వారు ట్రాక్టర్‌ను ఆపకుండా రెవెన్యూ సిబ్బందిని ఢీకొట్టి వెళ్లిపోయారు. ఈ ఘటనలో వీఆర్‌వో, వీఆర్‌ఏలకు గాయాలయ్యాయి. అయితే సిబ్బందిని ఢీ కొట్టి అధిక స్పీడ్‌తో వెళ్తూ ఇసుక ట్రాక్టర్ బోల్తాపడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకున్నారు.
వైసీపీ నేతలు అప్పుడే పదవులు పంచుకుంటున్నారు: యామిని