telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సింగీతం శ్రీనివాసరావుకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు : చంద్రబాబు

Singeetham

భారతీయ సినీ చరిత్రలో నిలిచిపోయే దర్శకులలో ఒకరు సింగీతం శ్రీనివాసరావు. ఈ దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ‘ఆదిత్య 369’ సినిమా ద్వారా ఒక కొత్త ప్రపంచాన్ని తెలుగు ప్రేక్షకులకు చూపించారు. ఆ తరువాత ‘పుష్పక విమానం’, ‘మయూరి’, ‘భైరవద్వీపం’ ఇలాంటి ఎన్నో గొప్ప, ప్రయోగాత్మక సినిమాలను వెండితెరపై ఆవిష్కరించిన సింగీతం ఇప్పుడు ప్రభాస్ సినిమాకు మెంటర్‌గా పని చేయడం విశేషం. దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు జన్మదినం సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన బాగుండాలని కోరుకుంటూ ట్వీట్ చేశారు. “శ్రీనివాసరావు గారూ… ఇటీవలే మీరు కరోనా బారినపడ్డారని విన్నారు. పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో హోం ఐసోలేషన్ లో ఉన్నారని తెలిసింది. మీ ఆరోగ్యం జాగ్రత్త. ఇటీవలే మీరు మీ మనవరాలితో కలిసి పాడిన మాయాబజార్ సినిమా నాటి పాటను విని ఆనందించాను. అదే ఉత్సాహంతో మీరు నిండు నూరేళ్లు ఉల్లాసంగా జీవించాలని కోరుకుంటున్నాను” అంటూ వ్యాఖ్యానించారు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో వైవిధ్యమైన చిత్రాలకు దర్శకత్వం వహించి ప్రేక్షకులను, విమర్శకులను మెప్పించారని చంద్రబాబు కొనియాడారు. ప్రతిభావంతుడైన తెలుగు సినీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు 90వ పడిలో అడుగుపెడుతున్న సందర్భంగా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వెటరన్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పుష్పక విమానం, ఆదిత్య 369, వంటి ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలు తీసిన వెండితెర సైంటిస్ట్ అంటూ కొనియాడారు. సింగీతం 89 ఏళ్ల వయసులోనూ సరికొత్త సైన్స్ ఫిక్షన్ చిత్రానికి పని చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయని, తాను కూడా ఆయన చిత్రం కోసం అభిమానులతో కలిసి ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని తెలిపారు.

Related posts