telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ

నటుడు మురళీమోహన్ పై .. ఈసీ కేసు, ..జయభేరి 2 కోట్లతో..

EC case filed on muralimohan

ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు అధికారులు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని సైబరాబాద్ లో 21 చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు పోలీస్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు. పోలీసుల తనిఖీల నేపథ్యంలో ఇద్దరు వ్యక్తులు తమకు అనుమానాస్పదంగా కనిపించారనీ, దీనితో వారి వాహనంలో సోదాలు నిర్వహించామని అన్నారు. ఈ ఇద్దరు వ్యక్తుల నుంచి రూ.2 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. ఈ నగదును తీసుకెళుతున్న వ్యక్తులను నిమ్మలూరి శ్రీహరి, పండరిగా గుర్తించామని తెలిపారు. వీరిద్దరూ జయభేరి కంపెనీలో పనిచేస్తున్నారన్నారు. ఎలాంటి పత్రాలు లేకుండా రూ.2 కోట్ల నగదును రైలు ద్వారా తరలించేందుకు వీరు ప్రయత్నించారని వ్యాఖ్యానించారు.

ఈ డబ్బును టీడీపీ నేత మురళీ మోహన్ కు అందించాల్సిందిగా జయభేరీ సంస్థకు చెందిన ధర్మారాజు, జగన్మోహన్ చెప్పినట్లు నిందితులు శ్రీహరి, పండరి అంగీకరించారన్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ ఎంపీ మురళీ మోహన్, యలమంచిలి మురళీకృష్ణ, జగన్మోహన్, ధర్మరాజు, పండరి, శ్రీహరిలపై కేసు నమోదు చేశామని సజ్జనార్ తెలిపారు. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 171బీ, 171ఈ, 171సీ, 171 ఎఫ్ కింద కేసు నమోదు చేశామన్నారు.

Related posts