telugu navyamedia
రాజకీయ

అగ్నిపథ్ స్కీమ్‌ పై కేంద్రం మరో కీలక నిర్ణయం..

అగ్నిపథ్‌ స్కీమ్‌కు వ్య‌తిరేకంగా దేశవ్యాప్తంగా భారీ హింసాత్మక నిరసనల వెల్లువెత్తడంతో అగ్నిపథ్‌పై హోంశాఖ శనివారం కీలక నిర్ణయం తీసుకుంది. అ‍గ్నివీర్లకు రిజర్వేషన్లు కల్పించనున్నట్టు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. సీఏపీఎఫ్‌ అసోం రైఫిల్స్‌లో అగ్నివీర్లకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నట్టు కేంద్రం తెలిపింది.

‘అగ్నిపథ్’ కింద ఆర్మీకి ఎంపికై నాలుగేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న వారికి.. కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, అస్సామ్ రైఫిల్స్‌లో 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని వెల్లడించింది. ఈ రెండు దళాల్లో నియామకాల్లో గరిష్ట వయో పరిమితిని అగ్నివీరులకు 3 ఏళ్ల పాటు సడలింపు ఇవ్వాలని కేంద్ర హోం మంత్రిత్వశాఖ నిర్ణయించింది.

అగ్నివీర్ యొక్క మొదటి బ్యాచ్ కోసం సూచించిన గరిష్ఠ వయోపరిమితి కంటే 5 సంవత్సరాలు వయో ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది.

నాలుగేళ్ల కాలపరిమితితో తొలిసారిగా కేంద్రం తీసుకొచ్చిన ‘అగ్నిపథ్‌’ సర్వీస్‌ పథకం కింద తొలిబ్యాచ్‌లో 45 వేల మందిని నియమించనున్నారు. టూర్‌ ఆఫ్‌ డ్యూటీ పేరిట ప్రత్యేక ర్యాలీలు నిర్వహించి ఈ నియామకాలు చేపట్టనున్నారు. నాలుగేళ్ల పరిమితితో కూడిన ఈ సర్వీస్‌లో ఎంపికైన వారికి సాంకేతిక నైపుణ్యంతో పాటు క్రమశిక్షణ కలిగినవారిగా తీర్చిదిద్దనున్నారు.

ఆర్మీ సర్వీసు పూర్తయ్యాక మెరుగైన ప్యాకేజీతో పాటు తుది దశ ఎంపికలో ప్రతిభ చూపిన 25 శాతం మందికి శాశ్వత కమిషన్‌లో పనిచేసేందుకు అవకాశమివ్వనున్నారు. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ట్విట్టర్‌ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది.

కేంద్ర సాయుధ పోలీసు బలగాలు ఇవే..

సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF), బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF), ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP), సశస్త్ర సీమ బల్ (SSB), నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (NSG), స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (SPG). ఈ బలగాలన్నీ కేంద్రహోంశాఖ పరిధిలోకి వస్తాయి. ఇక ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ దళాలు.. కేంద్ర రక్షణ శాఖ కింద ఉంటాయి.

Related posts