జపాన్‌లోని క్యోటో నగరం భారీ పేలుడుతో ఒక్కసారిగా దద్దరిల్లింది. స్థానిక యానిమేషన్ స్టూడియోలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో దాదాపు 20 మంది చనిపోయారని వార్తలు వస్తున్నాయి. అనేక మంది గాయాలపాలవడంతో.. వారందరిని ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో చాలా మంది పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. భారత కాలమానం ప్రకారం 10.30 గంటల ప్రాంతంలో ఈ పేలుడు సంభవించింది. సమాచారం అందుకున్న పోలీసులు .. వెంటనే అక్కడికి చేరుకున్నారు. సుమారు 35 అగ్నిమాపక వాహనాలతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. స్టూడియోలోని మొదటి అంతస్థులో పేలుడు సంభవించింది. ఓ వ్యక్తి పేలుడుకు పాల్పడినట్టుగా చెబుతున్నారు. మరోవైపు అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
previous post